రాజకీయాలు
బ్రేకింగ్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి నూతన బాధ్యతలు: తెలంగాణ కాంగ్రెస్ మీడియా & పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌గా నియామకం
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ నియామకానికి ఆమోదం తెలిపినట్లు, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.