Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
విద్య బ్రేకింగ్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు: "బొద్దింకలతో పెట్టుకోవద్దు"

ప్రతినిధి: ప్రత్యేక ప్రతినిధి
ప్రచురణ: 25 Jul 2026 10:50 AM
వీక్షణలు: 38 Views
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు: "బొద్దింకలతో పెట్టుకోవద్దు"

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు: "బొద్దింకలతో పెట్టుకోవద్దు"

  • ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యుత్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడాన్ని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసన వేదికగా ఆయన మాట్లాడుతూ "బొద్దింకల సత్తా ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది, బొద్దింకలతో పెట్టుకోవద్దు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ఈ రాజీనామా నీట్ పేపర్ లీక్ బాధితులకు దక్కిన న్యాయం. తమను తాము బాద్షాలుగా భావించే పాలకులను దారిలోకి తెచ్చేందుకు యువత ఐక్యతే కారణం. పాలకులను అదుపులో ఉంచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తమ ప్రధాన డిమాండ్లలో ఒకటైన మంత్రి రాజీనామా నెరవేరినప్పటికీ, మిగిలిన రెండు డిమాండ్లు సాధించే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు పరిహారం, ఇతర డిమాండ్ల సాధనకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. మరికొద్ది సేపట్లో సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న వేళ, ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన రాజీనామాను ప్రకటించడం గమనార్హం. న్యాయమైన విద్యార్థి పోరాటానికి ఈ రాజీనామా ఒక ఉదాహరణగా నిలిచిందని సీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు: "బొద్దింకలతో పెట్టుకోవద్దు"

news image
హైదరాబాద్, Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు: "బొద్దింకలతో పెట్టుకోవద్దు"ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యుత్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడాన్ని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసన వేదికగా ఆయన మాట్లాడుతూ "బొద్దింకల సత్తా ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది, బొద్దింకలతో పెట్టుకోవద్దు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ఈ రాజీనామా నీట్ పేపర్ లీక్ బాధితులకు దక్కిన న్యాయం. తమను తాము బాద్షాలుగా భావించే పాలకులను దారిలోకి తెచ్చేందుకు యువత ఐక్యతే కారణం. పాలకులను అదుపులో ఉంచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తమ ప్రధాన డిమాండ్లలో ఒకటైన మంత్రి రాజీనామా నెరవేరినప్పటికీ, మిగిలిన రెండు డిమాండ్లు సాధించే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు పరిహారం, ఇతర డిమాండ్ల సాధనకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. మరికొద్ది సేపట్లో సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న వేళ, ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన రాజీనామాను ప్రకటించడం గమనార్హం. న్యాయమైన విద్యార్థి పోరాటానికి ఈ రాజీనామా ఒక ఉదాహరణగా నిలిచిందని సీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.